ETV Bharat / state

గగన ప్రయాణం ప్రారంభం... జాగ్రత్తలు అవసరం - శంషాబాద్​లో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం

రాష్ట్రంలో దేశీయ విమానాల రెక్కలు విచ్చుకున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. విమానాశ్రయంలో ఏర్పాట్లను సీఎస్​ సోమేశ్​కుమార్​ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

domestic flight service started in samshabad airport
గగన ప్రయాణం ప్రారభం... జాగ్రత్తలు అవసరం
author img

By

Published : May 25, 2020, 11:33 PM IST

కేంద్ర పౌరవిమానాయాన మార్గదర్శకాల ప్రకారం దేశీయ విమనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా శంషాబాద్​ విమానాశ్రయంలోనూ దేశీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా విమానాశ్రయంలో తీసుకున్న జాగ్రత్తలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ పరిశీలించారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి 19 విమానాలు వెళ్తాయని... అంతే సంఖ్యలో ఇక్కడికి వస్తాయని సీఎస్​ తెలిపారు. మొత్తం 3,200 మంది రాకపోకలు సాగిస్తారని వివరించారు. ఇక్కడి నుంచి వెళ్లే వారికి... ఇతర నగరాల నుంచి వచ్చే వారికి థర్మల్​ స్కానింగ్​ ద్వారా పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్​ లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహించి పాజిటివ్​ వస్తేనే క్వారంటైన్​కు పంపుతామని... లేకపోతే ఇళ్లకు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.

శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే విమానాలు వివిధ కారాణాలతో తాత్కాలికంగా రద్దవుతున్నాయని ఎయిర్​పోర్ట్​ అధికారులు తెలిపారు. విమానాల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉందని... సీఎస్​ సోమేశ్​కుమార్​ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ఎయిర్​పోర్ట్​ అథారిటీ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి: మరో 3 రోజులు తప్పని భానుడి భగభగలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.