ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని మెహదిపట్నం వద్ద సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ముందు వైద్యులు ధర్నా నిర్వహించారు. తాము కష్టపడి 10 సంవత్సరాల పాటు ఈ విద్యను అభ్యసించిన తర్వాత ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. అలాంటింది ఇంటర్, టెన్త్ పాసైన విద్యార్థులను బ్రిడ్జ్ కోర్స్ ద్వారా తమకు సమానంగా చికిత్స చేసే అవకాశం ఇస్తే... దీనివల్ల ప్రజలకు కచ్చితంగా ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా..