కరోనా బారినపడి తీవ్రమైన బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న మలక్‌పేటకు చెందిన బాడీ బిల్డర్ సుశీల్ కుమార్(32)ను సురక్షితంగా కాపాడినట్లు యశోదా వైద్యులు ప్రకటించారు. గత నెలలో వైరస్ సోకిన సుశీల్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి విషమించడం మే 19న నటుడు సోనూసూద్ సహాయంతో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.
దాదాపు 80 శాతానికిపైగా ఊపిరితిత్తులు పాడైన పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన సుశీల్ కుమార్‌ను సుమారు నెల రోజుల చికిత్స అనంతరం క్షేమంగా డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితుడు ఆసుపత్రిలో చేరినప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించామని పేర్కొన్నారు. సుశీల్‌ను ఆసుపత్రికి చేర్చే విషయంలో నటుడు సోనూసూద్ అందించిన సాయం ఎంతో గొప్పదని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి కొనియాడారు.
ఇదీ చదవండి: ARREST: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్