ETV Bharat / state

వసంత్​​ను విధుల్లోకి తీసుకోవాలి: డాక్టర్స్ అసోసియేషన్

author img

By

Published : Feb 12, 2020, 4:41 PM IST

డాక్టర్ వసంత్​ ఘటన దృష్ట్యా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక సమావేశమయ్యారు. అతన్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Doctors Association meet at Gandhi Hospital Issue of Dr. vasanth
వసంత్​​ను విధుల్లోకి తీసుకోవాలి: డాక్టర్స్ అసోసియేషన్

నిన్న గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ వసంత్​పై జరిగిన ఘటనపై చర్చించడానికి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశమయ్యారు. డాక్టర్ వసంత్​పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. అతన్ని విధుల నుండి తొలగించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.

వసంత్​పై జరిగిన అన్యాయాన్ని డాక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ డాక్టర్ల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మరోసారి సమావేశంకావాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: ఆ ద్వయానికి ఏమైంది? వ్యూహాలకు పదును తగ్గిందా??

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.