ETV Bharat / state

పదివారాల్లో లక్ష మాస్కులు, లక్ష ఆహార ప్యాకెట్ల పంపిణీ - తెలంగాణ వార్తలు

కరోనా వేళ సాయం చేయడానికి దాతలు ముందుకొస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు డాక్టర్ రావుస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మాస్కులు, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. పది వారాల్లో లక్ష మాస్కులు, లక్ష ఆహార ప్యాకెట్లు పంచుతామని తెలిపారు.

doctor rao ent hospital food distribution, doctor rao ent hospital mask distribution
డాక్టర్ రావుస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ, కరోనా వేళ ఆహార ప్యాకెట్ల పంపిణీ
author img

By

Published : Apr 25, 2021, 11:31 AM IST

Updated : Apr 25, 2021, 4:59 PM IST

కరోనా రెండో దశలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ మాస్కు ధరించాలని డాక్టర్ రావుస్ ఈఎన్​టీ ఆస్పత్రి ఛైర్మన్ జి.వి.ఎస్ రావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వలస కార్మికులకు, ప్రయాణికులకు ఉచితంగా మాస్కులు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పది వారాల్లో లక్ష మాస్కులు, లక్ష ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అన్నదానం, నేత్రదానం కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ దానం కీలకమైందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరాపార్కు చౌరస్తాలో మాస్కులు పంపిణీ చేశారు. వేసవి కాలం దృష్ట్యా ప్రయాణికులకు మంచినీటి బాటిళ్లని అందజేయనున్నట్లుగా వెల్లడించారు. ప్రయాణికులు కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: కరోనాతో వెనక్కి తగ్గుతున్న దాతలు.. నిండుకున్న రక్త నిల్వలు

Last Updated : Apr 25, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.