తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్కరినీ ఆందోళనకు గురి చేయరాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ హాస్టళ్ల నుంచి విద్యార్థులు, ఇతర వర్కింగ్ పర్సన్స్‌ను యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపవద్దని మంత్రి సూచించారు.
వసతిగృహ నిర్వాహకులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి : సాయం చేయండి అంటూ కేటీఆర్‌కు ట్వీట్లు