పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ), దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)ను ఉపసంహరించాలని కోరుతూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై పలు సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఇప్పటికే ఎన్ఆర్సీ అసోంలో చాలా అల్లకల్లోలం సృష్టించిందని నిరసన కారులు ఆందోళన వ్యక్తం చేశారు. 19 లక్షల మందిని భారత పౌరులు కారని జైళ్లకు పంపడం జరిగిందన్నారు. అందులో అనేక మంది పేదలున్నారని వాపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. పౌరసత్వానికి మతాన్ని ప్రాతిపదికగా చేర్చడాన్ని వారు ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసులు, గృహకార్మికులు, మైనార్టీలు, పేదల కోసం పోరాడుతున్న పలు సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి.
ఇదీ చూడండి : ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు: పోలీస్ అకాడమీకి 'దిశ' తండ్రి, సోదరి