పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడారని భాజపా నేత డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టు ప్రారంభించి ఐదేళ్లు దాటినా నేటికీ ఓ రూపు రాలేదని... ఇంకో ఏడాదిలో పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా పనులు చేస్తున్నారని ఆరోపించారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులను తాను పోరాడి తెస్తే వాటి నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పదవికే కేసీఆర్ అనర్హుడని అరుణ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'