మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలోకి వస్తుండడం పట్లు పార్టీ నియోజకవర్గ బాధ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే బర్తరఫ్ చేసిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ(dk aruna) పెద్దిరెడ్డితో సమావేశమయ్యారు.
ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న పెద్దిరెడ్డిని పరామర్శించడంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దిరెడ్డికి డీకే.అరుణ సూచించారు.
ఇదీ చూడండి: ఉద్యమకారుల ఆశయాలకు భిన్నంగా తెరాస పాలన: కోదండరాం