ETV Bharat / state

DK ARUNA ON CM KCR: కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఉంది: డీకే అరుణ - paddy procurement in TS

DK ARUNA ON CM KCR: : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నెపం మోపి ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. యాసంగిలో ఉప్పుడు బియ్యం వేసే రైతులకు నూక వల్ల వచ్చే నష్టం నుంచి ఆదుకునేందుకు ప్రత్యేక బోనస్‌ ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు.

DK ARUNA ON CM KCR
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
author img

By

Published : Dec 22, 2021, 6:25 PM IST

DK ARUNA ON CM KCR: రైతుబంధు మాత్రమే ఇస్తున్న తెరాస సర్కార్‌ రైతులకిచ్చే అనేక ప్రోత్సాహకాలను గాలికొదిలేసిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసత్యాలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెరాస నేతల భాష సంస్కారహీనంగా ఉందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

DK aruna on paddy: గతేడాది కొన్న ధాన్యాన్ని రాష్ట్రం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదని డీకే అరుణ విమర్శించారు. యాసంగిలో బాయిల్డ్‌ రైసు ఇవ్వబోమని రాష్ట్రం రాసిచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటోందని ఆమె వెల్లడించారు. చివరిగింజ వరకు కొంటానన్న సీఎం కేసీఆర్... ఎందుకు కొనట్లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా రాష్ట్రాలు వరి రైతులకు ప్రోత్సాహం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​పై డీకే అరుణ విమర్శలు

'చివరిగింజ వరకు కొంటామన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు. రైతుల నష్టాన్ని భరించేందుకు పక్క రాష్ట్రాలు రైతులకు ప్రోత్సాహాలు ఇస్తుంటే మీరేం చేస్తున్నారు. యాసంగిలో వచ్చే నూకకు బోనస్​ ఎందుకివ్వడం లేదు. కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులకు ఇన్​పుట్ సబ్సీడీలు, ఎరువులు, మందులు, డ్రిప్​లు లేవు. ఇప్పటి వరకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా?' - డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

అపాయింట్​మెంట్​ లేకుండానే దిల్లీకి వస్తారా?

DK aruna on ministers: కేంద్ర మంత్రి దిల్లీలో ఉన్నారో లేదో కూడా తెలుసుకోకుండానే రాష్ట్ర మంత్రులు వచ్చారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరి అంటూ పూటకో మాటతో కేసీఆర్ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులను అదుకోవాలనే సోయిలేని ముఖ్యమంత్రికి లేదన్నారు.

హుజూరాబాద్​ దెబ్బకు మతిపోయింది

DK on cm kcr: హుజురాబాద్​లో భాజపా అభ్యర్థి ఈటల గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్​కు మతిపోయిందని డీకే అరుణ విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయామనే ఆందోళనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. కేంద్రమంత్రులపై సీఎం బూతులు మాట్లాడుతున్నారని.. ధాన్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రైతుకు కేసీఆర్ ఎందుకు అండగా ఉండడం లేదని ప్రశ్నించారు. రైతు బంధు పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దిల్లీకి వచ్చి మంత్రులు సేద తీరుతున్నారని.. పార్టీ కార్యాలయం నిర్మాణంపై తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. రైతులను మోసం చేసే డ్రామాలు ఇకపై బంద్ చేయాలని హితవు పలికారు. కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. సీఎం ఏం చెబితే మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు

Dk aruna elections: క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మంత్రులకు తెలియదా అని డీకే అరుణ ప్రశ్నించారు. చావు డప్పు కొట్టించిన ముఖ్యమంత్రికి సిగ్గు ఉందా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ మోహం పెట్టుకొని మంత్రులు దిల్లీకి వచ్చారని.. సీఎంకి ఎవరైనా లేఖ ఇస్తే తీసుకుంటారా? అని నిలదీశారు. ఎవరికైనా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సీఎం సమయం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని అమిత్ షా చెప్పారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.