ETV Bharat / state

గాంధీ ఆసుపత్రి అవుట్​సోర్సింగ్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ - వుట్​సోర్సింగ్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ

రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగికి కరోనా సోకడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం అవుట్​సోర్సింగ్ సిబ్బందికి ఎన్95 మాస్కులు, శానిటైజర్,తదితర వస్తువులను ఆసుపత్రి సూపరింటెండెంట్​ అందజేశారు.

gandhi hospital latest news
gandhi hospital latest news
author img

By

Published : May 23, 2020, 6:15 PM IST

గాంధీ ఆస్పత్రిలో అవుట్​ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారికి ఎన్95 మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అవుట్​ సోర్సింగ్ సిబ్బందికి తగిన రక్షణ కల్పించడం తమ బాధ్యత అని అన్నారు.

ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వారు కచ్చితంగా మాస్కులు, శానిటైజర్ వాడాలని ఆయన సూచించారు. రెండు రోజుల క్రితం విధులు నిర్వహిస్తున్న అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం వల్ల... అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారి బాగోగులు చూసుకునే బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.