వలస కార్మికులను ఆదుకోవాలని ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో వలస కార్మికులకు తెజస సరకులు పంపిణీ చేసింది. సికింద్రాబాద్లోని అడిక్మెట్ డివిజన్ జన సమితి అధ్యక్షుడు కాకునూరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర కమిటీ అధ్యక్షుడు ఎం.నరసయ్య హాజరయ్యారు. బీహార్, పశ్చిమ బంగా, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
ఆకలితో అలమటించే పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు మరింత ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు జైపాల్ రెడ్డి, మద్దూరి సురేష్, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- 6 గంటలు రోడ్డుపైనే కరోనా రోగులు