కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్రపరిశ్రమ పెద్దలు చేదోడు వాదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే “కళామ తల్లి చేదోడు” పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసినట్లు చిత్ర నిర్మాత రవిచంద్ర వెల్లడించారు. కార్మికులను ఆదుకోవడానికి ఎవరి వద్దా డబ్బులు తీసుకోబోమని... దాతలు కేవలం సరుకులు మాత్రమే ”కళామ తల్లి చేదోడు"కు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు దర్శకడు చదలవాడ శ్రీనివాసరావు, దిల్‌రాజు కలిసి 600 మంది సినీకార్మిక కుటుంబాలకు సరిపోయే నిత్యావసర సరుకులు సమకూర్చారని తెలిపారు. ఫిలీం ఛాంబర్‌లోని డి. రామానాయుడు కళా మండపంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు నిర్మాత రవిచంద్ర తెలిపారు.
ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!