ETV Bharat / state

ఆశా వర్కర్లకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ​ - ఆశా వర్కర్లకు సాయం

కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్​, ముషీరాబాద్​లోని కార్మికులకు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. స్థానిక అక్షర స్ఫూర్తి సంస్థ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్​ అందజేశారు.

Asha Workers
Asha Workers
author img

By

Published : Jun 18, 2021, 7:27 PM IST

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అహర్నిశలు కృషి చేస్తోన్న ఆశా వర్కర్లకు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అండగా నిలిచారు. హైదరాబాద్​, ముషీరాబాద్​లోని కార్మికులకు.. స్థానిక అక్షర స్ఫూర్తి సంస్థ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్, టిఫిన్​ బాక్సుల​ను అందజేశారు. కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ చేస్తోన్న కృషి అభినందనీయమన్నారు.

లాక్​డౌన్​లో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో.. కేంద్రం 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందని లక్ష్మణ్ ప్రస్తావించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, భాజపా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చితి మంటలను చూసైనా స్పందించరా: రఘునందన్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.