ETV Bharat / state

వరద బాధితులకు విరాళమిచ్చిన మద్యం తయారీ సంస్థలు

భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల సహాయార్థం పలు మద్యం తయారీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి 25లక్షలు ప్రభుత్వానికి విరాళమిచ్చారు. హైదరాబాద్​లోని బీఆర్​కే భవన్​లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​ కుమార్​కు డిస్టలరీల యజమానులు కోటి రూపాయల చెక్కు, రూ.25 లక్షల నగదు అందించారు.

Distilleries Compenies donation for hyderabad floods victms
వరద బాధితులకు విరాళమిచ్చిన మద్యం తయారీ సంస్థలు
author img

By

Published : Oct 23, 2020, 7:26 PM IST

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవాడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. బాధితుల సహాయార్థం పలు మద్యం తయారీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 కోటి 25 లక్షల విరాళం అందించారు.

హైదరాబాద్​లోని బీఆర్​కే భవన్​లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​ కుమార్​ను కలిసి డిస్టలరీల యజమానులు, కింగ్​ఫిషర్​ కంపెనీ, ఆఫీసర్స్​ ఛాయిస్​, బ్లండర్స్​ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కోటి రూపాయలు చెక్కును, రూ.25లక్షలు రూపాయల చెక్కును విడివిడిగా అందచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని... వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సహాయం అందచేసినట్లు తెలంగాణ రాష్ట్ర డిస్టలరీల అసోసియేషన్‌ అధ్యక్షుడు మన్నవ కామేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లెండర్స్‌ కంపెనీ ఛైర్మన్‌ కిషోర్‌ ఆర్‌. ఛాబ్రియా, ఇతర కంపెనీల అధిపతులు ఉన్నారు.

ఇదీ చదవండిః కరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.