ETV Bharat / state

అది అర్థం కాకపోవడం నా దురదృష్టం.. నాగబాబుపై ఆర్జీవీ ట్వీట్ - పవన్​పై రామ్​గోపాల్​ వర్మ ట్వీట్

RGV TWEET ON NAGABABU: ఇటీవల తాను జనసేన, పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు పవన్‌ అభిమానిగా చేశానని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ ట్వీట్లు అర్థం చేసుకోకపోవటం తన దురదృష్టమని, అంతకన్నా పవన్‌కల్యాణ్‌ దురదృష్టమన్నారు.

RGV TWEET ON NAGABABU
RGV TWEET ON NAGABABU
author img

By

Published : Jan 16, 2023, 11:38 AM IST

VARMA TWEET ON NAGABABU : వివాదాస్పద చిత్రాలు, కామెంట్లకు కేరాఫ్​ అడ్రస్​ సినీ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఆయనకు సంబంధించిన వీడియోలు, ట్విటర్​లో పోస్టులు సోషల్​ మీడియాలో హాట్​టాపిక్​ అవుతాయి. ఎదో ఒక వీడియో పెట్టి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతారు. తాజాగా జనసేన లీడర్​, సినీనటుడు నాగబాబును ఉద్దేశించి పెట్టిన వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. ఆ వీడియోకి "హలో పవన్​ కల్యాణ్​ గారు, కొంచెం మీ భాయిజాన్​ను చూసుకోండి" అంటూ క్యాప్షన్​ పెట్టి పోస్టు పెట్టారు. ఇంతకీ ఆయన వీడియోలో ఏమన్నారంటే..?

"కొణిదెల నాగబాబు గారు.. ఆయన తమ్ముడికి, ఆయన అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు.​ కానీ నాకు కాదు. నేను జనసేన, పవన్​ కల్యాణ్​ మీద చేసిన ట్వీట్లు కేవలం పవన్​కల్యాణ్​ అభిమానిగా మాత్రమే చేశాను. అది అర్థం అవ్వకపోవడం నా దురదృష్టం, నా కన్నా ఎక్కువ పవన్​ కల్యాణ్​ దురదృష్టం. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలా సలహాదారులుగా పెట్టుకుంటే దాని తర్వాత పవన్​కల్యాణ్​ అవుట్​కమ్​ ఏంటో ప్రజలే తెలుపుతారు" అని ఆర్జీవీ ట్వీట్​ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.