కరోనాను సమర్థంగా ఎదుర్కొవడంలో వ్యాక్సిన్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. టీకా విషయంలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ఆయన సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ తొలిడోసు శ్రీనివాసరావు తీసుకున్నారు. సీఆర్‌పీఎఫ్ సదరన్ కార్యాలయంలో ఐజీ మహేశ్ లద్దా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల 50 వేల మందికి పైగా హెల్త్ కేర్ సిబ్బంది, ఇతర శాఖ అధికారులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో కొద్దిపాటి అస్వస్థతకు గురి కావడం సర్వసాధారణమని ఆయన తెలిపారు. శరీరంపై దాడి చేసే వైరస్లను తట్టుకునే శక్తిని పెంపొందించుకునే క్రమంలో స్వల్పంగా జ్వరం ఇతర సమస్యలు రావడం సహజమేనన్నారు. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడే తీసుకున్న వ్యాక్సిన్ సక్రమంగా పని చేస్తున్నట్లుగా భావించాలన్నారు.
ఇదీ చూడండి: గుర్రంబోడు భూ కబ్జాలకు తెరాసయే కారణం: ఉత్తమ్