ETV Bharat / state

Konatham Dileep: వరుసగా రెండో సారి.. పీఆర్​సీఐ చాణక్య అవార్డు - పీఆర్​సీఐ చాణక్య అవార్డు

పబ్లిక్​ రిలేషన్స్ రంగంలో వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు కనబరిచే అసాధారణ ప్రతిభ ఆధారంగా పీఆర్​సీఐ చాణక్య అవార్డులను అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్​ మీడియా శాఖ అత్యద్భుత పనితీరును గుర్తిస్తూ... కొనతం దిలీప్​కు పీఆర్​సీఐ ఈ అవార్డును అందించింది.

Konatham Dileep
పీఆర్​సీఐ చాణక్య అవార్డు
author img

By

Published : Sep 18, 2021, 2:21 PM IST

తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్... ప్రజాసంబంధ వ్యవహారాల్లో ఇచ్చే చాణక్య అవార్డును అందుకున్నారు. పబ్లిక్​ రిలేషన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ఇచ్చే ఈ అవార్డు 2021గాను దిలీప్​ను ఎంపిక చేసినట్లు పీఆర్​సీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా పీఆర్​సీఐ గ్లోబల్ కమ్యునికేషన్స్ సదస్సులో దిలీప్ ఈ అవార్డును అందుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని డిజిటల్ మీడియా వింగ్​లో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. కొనతం దిలీప్ ఈ అవార్డును అందుకోవటం వరుసగా రెండో సారి. గతేడాది 2020లోనూ కర్ణాటక సీఎం చేతుల మీదుగా... బెంగళూరులో జరిగిన సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డుకు ఎంపికైనందుకు డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్​ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఇదీ చూడండి: 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.