పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... పాతబస్తీ, మెహదీపట్నం, పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లో పౌరసత్వ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పలువురు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు విరుద్ధమన్నారు. వలసదారులకు పౌరసత్వం ఇవ్వాలంటే అందరికీ ఒకేలాంటి విధానాలను పాటించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?