ETV Bharat / state

వాహన పన్నులు రద్దుచేయాలని ట్రావెల్స్ నిర్వాహకుల ఆందోళన - ఖైరతాబాద్​లో టూర్స్​ అండ్​ ట్రావెల్స్​ ధర్నా వార్తలు

కరోనా నేపథ్యంలో వాహన పన్నులను రద్దు చేయాలంటూ ఖైరతాబాద్​లోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట టూర్స్​ అండ్​ ట్రావెల్స్​ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ఆరు నెలల పన్నులను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

Dharna at khairathabad rto office to repeal vehicle taxes
వాహన పన్నులు రద్దు చేయాలంటూ ధర్నా
author img

By

Published : Jun 29, 2020, 12:18 PM IST

హైదరాబాద్ ఖైరతాబాద్​లోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో 6 నెలల వాహన పన్నుల​ను రద్దు చేయాలంటూ డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు భారీగా బస్సులు, ఇతర వాహనాలు నిలిపివేశారు. కొవిడ్​ కారణంగా మూడు నెలలుగా తమకు ఆదాయం లేదని.. ప్రభుత్వం వాహన పన్నుల​ను రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు, ట్రావెల్స్​ నిర్వాహకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహాల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీచూడండి: ఇంజినీరింగ్ కళాశాలల వ్యూహం.. ఇలా వేసి అలా తీసుకుంటున్నాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.