కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యుత్ సౌధలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్రం నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకు వచ్చిందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేత శివాజీ ఆరోపించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ లోని అన్ని విభాగాలు లాభాల బాటలో ఉన్నాయని ఒకవేళ దీన్ని కార్పొరేట్ల పరంచేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కొత్త విద్యుత్ చట్టాన్ని అమలులోకి తీసుకురావద్దని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: లెక్కతప్పుతున్న విద్యుత్ బిల్లు రీడింగ్.. ఆందోళనలో ప్రజలు