ETV Bharat / state

3 కమిషనరేట్లలో 35 వేలమంది పోలీసులతో బందోబస్తు... - నిమజ్జనం

3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 35 వేల మంది పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. నిమజ్జనోత్సవాలు జరిగే అన్ని ప్రాంతాల్లో నిఘానేత్రాలు అమర్చినట్లు తెలిపారు. అన్ని ఠాణాలతోపాటు డీజీపీ కార్యాలయంలోనూ కమాండ్​ కంట్రోల్​ రూం ఏర్పాటు చేసి పరిస్థితులు సమీక్షించనున్నట్లు వివరించారు.

DGP Mahender Reddy on immersion arrangements
author img

By

Published : Sep 11, 2019, 7:52 PM IST

3 కమిషనరేట్లలో 35 వేల మంది పోలీసుల బందోబస్తు...

నిమజ్జనోత్సవాలకు సంబంధించి మూడు కమిషనరేట్ల పరిధిలో పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో... సాధారణ పౌరులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 3 కమిషనరేట్లలో కలిపి 35 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్రలో గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ హెచ్చరించారు. నిమజ్జనం పూర్తయిన విషయాన్ని కూడా మండపం నిర్వాహకులు పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.