ETV Bharat / state

DGP Mahender reddy: పకడ్బందీగా 5-ఎస్‌ విధానం అమలు - పోలీస్ స్టేషన్లలో 5ఎస్ అమలు

రాష్ట్రంలోని పోలీస్​ స్టేషన్లు, పోలీసు కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఉత్తమ సేవలు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనరేట్లకు, ఎస్పీ కార్యాలయాల ఆర్​ఐలతో డీజీపీ మహేందర్​ రెడ్డి సూచించారు.

DGP Mahender reddy
డీజీపీ మహేందర్​ రెడ్డి
author img

By

Published : Jul 29, 2021, 11:08 AM IST

రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన సేవలందించే వాతావరణం కల్పించేందుకు 5-ఎస్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సార్ట్‌, సెట్‌ ఇన్‌ ఆర్డర్‌, షైన్‌, స్టాండర్డైజ్‌, సస్టెయిన్‌ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 9 కమిషనరేట్లు, 20 జిల్లాల ఆర్‌ఐలతో బుధవారం తన కార్యాలయంలో డీజీపీ సమీక్ష నిర్వహించారు.

అర్హత మేరకు కిట్లు

అన్ని ఠాణాల్లో 15 ఏళ్లుగా వృథాగా ఉన్న పాత, వ్యర్థ పరికరాలను నిబంధనలను అనుసరించి వేలం వేయగా రూ.50.35 లక్షలు ప్రభుత్వ ఖజానాలో సమకూరాయని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉండే పోలీస్‌ సిబ్బందికి రెయిన్‌కోట్‌, గ్రౌండ్‌షీట్‌, బ్లాంకెట్‌, స్వెటర్‌ తదితర వస్తువులతో కూడిన కిట్‌ను సకాలంలో సమకూర్చేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా పోలీసు సిబ్బందికి వారి అర్హత మేరకు అందించే కిట్​ల పంపిణీని డి.జి.పి కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న లాజిస్టిక్స్‌ విభాగం ఐజీ సంజయ్‌జైన్‌, డీఎస్పీ వేణుగోపాల్‌ను అభినందించారు. పోలీసు కార్యాలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆర్‌ఐలకు డీజీపీ మహేందర్​ రెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు.

విదేశీ విద్యారుణాల్లో వెసులుబాటు

పోలీస్‌ కుటుంబాల్లోని విద్యార్థుల విదేశీ విద్యారుణాల్లో వెసులుబాటు కల్పిస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పోలీస్‌ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యారుణం కింద రూ.15 లక్షల వరకు మంజూరు చేసేవారు. పోలీస్‌ అధికారి హోదాను బట్టి అర్హతను నిర్ణయించేవారు. తాజాగా ఆ పరిమితిని రూ.30 లక్షలకు పెంచారు. పోలీస్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి మేరకు డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భద్రత వైస్‌ ఛైర్మన్‌, అదనపు డీజీపీ(సంక్షేమం) ఉమేశ్‌ షరాఫ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ పరిమితి పెంపు జులై 1 నుంచే అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ట్యూషన్‌ ఫీజుకు మాత్రమే రుణం మంజూరు చేసేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇక నుంచి ట్యూషన్‌ ఫీజుతోపాటు ఇతర ఖర్చులకూ రుణం ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: HOME TUTOR: ఇంటికే గురువు.. ఉపాధికి ఆదరువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.