సాంకేతిక విరివిగా ఉపయోగించి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడగలిగామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.
సీసీ కెమెరాల ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడిందని డీజీపీ అన్నారు. మాదాపూర్ జోన్‌లో 2 వేల 58 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సహకరించిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లక్షా 26 వేల కెమెరాలు ఉన్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇదీ చూడండి: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం : వినయ్ భాస్కర్