ETV Bharat / state

అటవీ అధికారులకు మద్దతివ్వాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశాలు - DGP Mahender reddy reacts to FRO murder

DGP Mahender reddy reacts to FRO murder : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల ఫారెస్ట్‌ అధికారి హత్యోదంతంతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. అటవీశాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలపై ఆ శాఖ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఎస్పీలు, అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియల్ పాల్గొన్నారు.

DGP Mahender Reddy Teleconference
డీజీపీ మహేందర్‌రెడ్డి
author img

By

Published : Nov 25, 2022, 12:06 PM IST

DGP Mahender reddy reacts to FRO murder : క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని భరోసా కల్పించాలని పోలీస్ శ్రేణులను డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలో క్షేత్రాధికారి శ్రీనివాసరావు హత్య, అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ విజ్ఞప్తి నేపథ్యంలో అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీసీసీఎఫ్ డోబ్రియల్ కూడా కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి అటవీ అధికారులు, సిబ్బందికి మద్ధతుగా నిలిచి భరోసా కల్పించాలని.. భద్రాద్రి కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

అటవీ అధికారులు, సిబ్బంది సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని పోలీసులకు డీజీపీ చెప్పారు. అదే తరహాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.