సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లలో ఎన్నికల కోడ్, ఇతరత్రా కారణాల వల్ల నిలిచిన అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేాయాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మైలార్గడ్డలోని 8వ నెంబరు కాలనీలో రూ.11 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రోడ్లు వేయడానికి ముందే మంచి నీరు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని సూచించారు.
అడ్డగుట్టలోని స్థానిక ప్రజలకు నీటి కొరతను తీర్చేందుకు డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు కొత్తగా ఓ పవర్ బోరింగ్ ఏర్పాటు చేశారు. వెంకట్ నగర్లో మరో పవర్ బోరింగ్ ఏర్పాటు పనులను స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేత తీగుల్ల రమేశ్వర్ గౌడ్ ప్రారంభించారు.
ఇదీ చూడండి: యాదాద్రిపై కరోనా ప్రభావం.. భారీగా తగ్గిన ఆదాయం