హైదరాబాద్ నగరం చిరకాలంగా సర్వమతాలకు ఆవాసమని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. నగరంలోని చిలకలగూడాలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో అయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ముస్లింలకు వెనుదన్నుగా నిలుస్తుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఉర్సు వేడుకలో భాగంగా నిర్వహించిన ఉర్సు ఈ -షరీఫ్‌లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశ సగటుతో పోలిస్తే బడ్జెట్లో తక్కువ నిధులు: భట్టి