గ్రేటర్ ఎన్నికల్లో అధికార తెరాసకు నిరసనల సెగ తగులుతోంది. తార్నాక డివిజన్ సిట్టింగ్ అభ్యర్థికి టికెట్ ఇవ్వనందుకు ప్రచారానికి వచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు.
డివిజన్లోని మాణికేశ్వరనగర్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వాగ్వాదం తలెత్తింది. మాజీ కార్పొరేటర్ సరస్వతిహరితో పద్మారావు చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది. తెరాస అభ్యర్థి శ్రీలతరెడ్డికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించుకున్నారు.