ETV Bharat / state

తెరాసకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు: పద్మారావు గౌడ్​ - ఓటర్లకు ఉపసభాపతి పద్మారావు గౌడ్ కృతజ్ఞతలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్​ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన విధానాల వల్లే తెరాసకు విజయం దక్కిందన్నారు. తెరాస అభ్యర్థి గెలుపుతో సీతాఫల్​మండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు.

deputy speaker padma rao goud participated MLC elections winning by  trs candidate vani devi today at seethafalmandi in secunderabad
తెరాసకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు: పద్మారావు గౌడ్​
author img

By

Published : Mar 20, 2021, 8:45 PM IST

అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన విధానాలను వల్లే తెరాసకు పట్టభద్రులు పట్టం కట్టారని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్​ అన్నారు. వాణీదేవి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో సికింద్రాబాద్​ సీతాఫల్​మండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.

ఈ ఎన్నికల్లో విజయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పద్మారావు గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బాణాసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్​కు అనుకూలంగా నినాదాలు చేశారు. వాణీదేవి విజయంతో రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని మహంకాళి దేవాలయం దగ్గర బాణా సంచాలు కాల్చి మాజీ కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ సంబురాలు జరుపుకున్నారు.

ఇదీ చూడండి: రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా పద్మారావుగౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.