ETV Bharat / state

బల్దియాలో తెరాసదే విజయం: పద్మారావు గౌడ్ - పద్మారావు గౌడ్ పర్యటన

హైదరాబాద్​లోని అడ్డగుట్ట డివిజన్​లో తెరాస నేతలు, కార్యకర్తలతో కలిసి ఉప సభాపతి పద్మారావు గౌడ్ పాదయాత్ర చేశారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమకు విజయాన్ని చేకూర్చుతాయని ఆయన పేర్కొన్నారు. బల్దియా ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

deputy speaker padma rao goud about ghmc elections
బల్దియాలో తెరాసదే విజయం: పద్మారావు గౌడ్
author img

By

Published : Nov 17, 2020, 10:44 AM IST

తెరాస చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భారీ విజయాన్ని తీసుకువస్తాయని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట డివిజన్​లో పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి ఆయన సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఏసీఎస్​ నగర తదితర ప్రాంతాల్లో తెరాస యువ నేతలు తీగల్ల కిషోర్ కుమార్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, ఇతర నేతలతో కలిసి ఇంటింటికీ తిరిగారు.

బల్దియా ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల ఎజెండాతో కాకుండా ప్రజల సంక్షేమ ఎజెండాతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. తెరాసను గెలిపించి... అభివృద్ధి సాఫీగా సాగేలా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: ఆ ఊరిలో గుడిసెల్లేవు- కారణం ఆయనే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.