హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, ప్రశాంతి గోల్డెన్ హిల్స్‌లో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మొత్తం నెల రోజులకు సరిపోయే 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్ పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద పిలుపు మేరకే నిజాంపేట పరిధిలో నిత్యం భోజనంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే 20 కేసులు