హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను కూల్చివేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ప్రజలను రక్షించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత కొనసాగిస్తామన్నారు.
వారం రోజుల్లో శిథిలావస్థలో ఉన్న 65 భవనాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. వర్షాలు పడుతున్నందున పురాతన భవనాలు ఖాళీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం