ETV Bharat / state

నందకుమార్​కు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేత.. వివరణ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ.. - ఫిల్మ్‌నగర్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Demolition of illegal constructions in Filmnagar: ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఆ నిర్మాణాలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్‌కు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. దీనిపై స్పందించిన నందకుమార్ భార్య.. రాజకీయ కక్షతోనే కూలుస్తున్నట్లు అనుమానంగా ఉందని ఆరోపించారు. కూల్చివేతలపై జీహెచ్ఎంసీ అధికారులు వివరణ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Demolition of illegal constructions
Demolition of illegal constructions
author img

By

Published : Nov 13, 2022, 3:23 PM IST

Updated : Nov 13, 2022, 6:06 PM IST

Demolition of illegal constructions in Filmnagar: హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో రెండు అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. దక్కన్ కిచెన్ సమీపంలో ఉన్న కూల్చివేసిన ఆ నిర్మాణాలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్‌కు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. నందకుమార్‌ దక్కన్ కిచెన్‌ను ప్రమోద్ అనే భాగస్వామితో కలిసి నిర్వహిస్తున్నారని వెల్లడించారు. నందకుమార్ అక్రమ నిర్మాణం చేపట్టి వ్యాపారాలు సాగిస్తున్నట్లు తెలిపిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. నోటీసులు ఇచ్చినా ఆపకుండా కొనసాగిస్తుండటంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసినట్లు తెలిపారు.

రాజకీయ కక్షతోనే కూలుస్తున్నట్లు అనుమానం.. ఫిల్మ్‌నగర్‌లో తాము లీజుకు తీసుకున్న భూమిలో కట్టడాలను అక్రమంగా కూల్చేశారని నందకుమార్ భార్య చిత్రలేఖ పేర్కొన్నారు. తమకు గతంలో నోటీసు ఇచ్చారన్న ఆమె.. లీజు అగ్రిమెంట్‌ను వారికి చూపించామని తెలిపింది. ఇవాళ జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలా కూల్చేస్తారని ఆమె ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే కూలుస్తున్నట్లు అనుమానంగా ఉందని చిత్రలేఖ ఆరోపించారు. కనీసం వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లీగల్ అయినప్పడు.. ప్రస్తుతం ఎలా అక్రమ నిర్మాణం అయిందని ప్రశ్నించారు. భూమికి సంబంధించిన తమ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం అధికారులకు అందిస్తామని నందకుమార్ భార్య తెలిపారు. ఈ భూమి లీజ్ పై దగ్గుబాటి కుటుంబం ఫిర్యాదు చేసినట్లు తమకు సమాచారం ఉందని చిత్రలేఖ వివరించారు.

కూల్చివేతలపై జీహెచ్‌ఎంసీ వివరణ.. దక్కన్ కిచెన్ వద్ద నిర్మాణాల కూల్చివేతలపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. దక్కన్ కిచెన్ హోటల్‌ ముందు భాగంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని తెలిపారు. ఈవిషయమై ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చామన్నారు. గతేడాది కూడా ముందుభాగంలో ఉన్న నిర్మాణాలను సీజ్ చేశామని చెప్పారు. చివరగా నెల కిందట కూడా నోటీసులు ఇచ్చామన్నారు. లీజ్ అగ్రిమెంట్ పంపిచారు తప్ప.. అక్రమ నిర్మాణాలపై స్పందించలేదని అధికారులు వెల్లడించారు. దక్కన్ కిచెన్ ముందుభాగంలో రెండు నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని తెలిపారు. పదే పదే చెప్పిన అందులో కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరణ ఇచ్చారు.

మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం.. ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్​లోను సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్న అధికారులు... హర్యానాలో రామచంద్ర భారతి నివాసంతో పాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన ఇంటిలోనూ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో సింహయాజి స్వామిజీకి చెందిన ఆశ్రమంకి వెళ్ళిన మరో బృందం సోదాలు చేస్తోంది.

హైదరాబాదులోని నందు కుమార్‌కు చెందిన ఇల్లు, హోటల్లో సోదాలు నిర్వహించారు. కేరళలోని కొచ్చిలో ఉండే ఓ వైద్యుడు రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ వైద్యుడి ఇంట్లోనూ సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి బంధువు, తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావడానికి సింహయాజీ స్వామిజీకి విమానం టికెట్ బుక్ చేసినట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా సోదాల అనంతరం మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 13, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.