ETV Bharat / state

'అనుమతులు ఉన్నా... డిమాండ్ అంతంత మాత్రమే' - విమాన ప్రయాణాలు

లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. మూడు రోజుల్లో పదివేల మందికిపైగా ప్రయాణికులు ఎయిర్‌ పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. వందకు పైగా విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల మూడోవంతు మాత్రమే నడుస్తున్నాయి.

Shamshabad Airport latest news
Shamshabad Airport latest news
author img

By

Published : May 27, 2020, 10:53 PM IST

మొదటి రోజు ఈ నెల 25వ తేదీన వివిధ ప్రాంతాల నుంచి 19 విమానాలు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు రాగా 20 విమానాలు ఇక్కడ నుంచి వెళ్లాయి. మొత్తం కలిపి 39 విమానాల ద్వారా దాదాపు మూడు వేల మంది ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరారు. ఈ నెల 26న కూడా 19 విమానాలు ఇక్కడికి రాగా 20 విమానాలు ఇక్కడ నుంచి వివిధ నగరాలకు వెళ్లాయి. మొత్తం 39 విమానాల రాకపోకలు సాగించడం ద్వారా...3500 మంది ప్రయాణీకులు వారి స్వస్థలాలకు చేరుకున్నారు. అదే విధంగా బుధవారం 20 విమానాలు శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు రాగా మరో 21విమానాలు ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లాయి. తద్వారా 3600 మంది ప్రయాణీకులు వారి గమ్య స్థానాలకు చేరుకున్నారు. మూడు రోజుల్లో పదివేలకుపైగా విమానాల్లో ప్రయాణం చేశారు.

సగటున 85 శాతం మంది ప్రయాణిస్తున్నారు...

ఒక్కో విమానంలో సగటున 85శాతం మంది ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులు పెరిగితే విమానాల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తగినంత మంది ప్రయాణీకులు లేక కొన్ని ఎయిర్‌వేస్‌ సంస్థల విమానాలు రద్దు అవుతుండగా...కొన్ని రాష్ట్రాలు విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయిలో విమానరాకపోకలు కొనసాగడం లేదని ఎయిర్‌ పోర్టు అధికారులు తెలిపారు.

వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల...తప్పనిసరి అయితే తప్ప ప్రయాణం చేయడానికి ముందుకు రావడం లేదు. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు మాత్రమే సొంత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇందువల్లనే విమాన ప్రయాణాలకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ పెరగడం లేదని ఎయిర్‌ వేస్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. పరిస్థితులు చక్కబడితేకాని విమాన ప్రయాణాలకు ప్రజలు ముందుకు రారని, డిమాండ్‌ పెరగకుంటే విమానాల సంఖ్య పెరిగే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.