రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జులై 1వ తేదీనుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అన్నిరకాల విద్యాసంస్థలను... పూర్తి స్థాయి సన్నద్ధతతో పునఃప్రారంభించాలని సూచించింది. ఆఫ్లైన్ తరగతులకు హాజరుకావొచ్చని తెలిపారు.
తాజా నిర్ణయం నేపథ్యంలో... ఆ దిశగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆఫ్లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకానున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు విద్యాశాఖ సూచించింది.
ఇదీ చూడండి: TS UNLOCK: తెలంగాణ అన్లాక్.. ఇవన్నీ ఓపెన్