Navy Annual day will be in Vizag: ఈ ఏడాది నౌకాదళ దినోత్సవానికి ఈస్ట్రన్ కమాండ్ ప్రధాన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది. ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవం ఈసారి.. విశాఖలో నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాన దళాధిపతి -సీడీఎస్ అనిల్ ఛౌహాన్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా విశాఖ బీచ్ రోడ్డులో ఆరోజు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించనున్నట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి రక్షణ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము హాజరుకానున్న నేపథ్యంలో... కొత్త తరహాలో స్వాగతం పలకేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ సహా యుద్ద నౌకలు, సబ్‌మెరైన్‌లు విన్యాసాల్లో భాగం కానున్నాయి.
ఇవీ చదవండి.. Warangal Road Accident Today: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. కుటుంబం బలి