గత రెండు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగరం వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున శివార్లతో పాటు నగరంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రికి చలి పెరగడం ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిస్తోంది. ఆదివారం రాత్రి సమయానికి శివార్లలో అత్యల్పంగా బీహెచ్ఈఎల్ వద్ద 12.5 డిగ్రీలు, బండ్లగూడ 12.9, కుత్బుల్లాపూర్‌లో 13.9, రాజేంద్రనగర్‌లో 14.1, గచ్చిబౌలిలో 14.4, వనస్థలిపురంలో 14.5, హయత్‌నగర్ 14.6, మాదాపూర్ 15.1, షాపూర్‌నగర్ 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: నేటి నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు