ఎంసీఐ అర్హత పరీక్షలో... ఫిలిప్పీన్స్ దవావో మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు సత్తా చాటారు. జులై 31, 2019న విడుదలైన ఎంసీఐ అర్హత పరీక్షను వివిధ దేశాల్లోని 259 కాలేజ్‌లకు చెందిన 13,600 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో దవావో మెడికల్ కాలేజ్ విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ బేగంపేటలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో ఎస్‌జీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఎంసీఐ పరీక్షా ఫలితాల సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీ కన్సల్టెన్సీ డైరెక్టర్ సతీష్ గరికపాటితో పాటు ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారు ఎంసీఐ పరీక్షలు ఉత్తీర్ణత సాధించలేరు అనే అపోహను తమ కాలేజీ విద్యార్థులు తొలగించినట్లు సతీష్ తెలిపారు. ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 10లో ఏడుగురు దవావో మెడికల్ కాలేజీ విద్యార్థులు ఉన్నారని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'అభిమాన నటుడితో పనిచేయటం ఆనందంగా ఉంది'