ETV Bharat / state

Daughter Killed Father : నిత్యం గొడవ పడుతున్నాడని పెంపుడు తండ్రిని చంపిన యువతి - హైదరాబాద్​లో తండ్రిని చంపిన కూతురు

Daughter Killed Her Father In Hyderabad : నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తున్నాడని పెంపుడు తండ్రినే హతమార్చింది కూతురు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించిన ప్రాణం దక్కలేదు. స్థానికుల సమాచారంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Daughter Killed Father
Daughter Killed Father
author img

By

Published : Jul 30, 2023, 7:28 PM IST

Updated : Jul 31, 2023, 10:15 AM IST

Daughter Killed Her Father With Glass Shell : పని చేయకపోగా నిత్యం మద్యం తాగి తల్లిని వేధిస్తున్నాడని.. తమతో గొడవ పడుతున్నాడని పెంపుడు తండ్రి కూతురు హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గోల్నాక తులసీరామ్‌నగర్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌ పేటలో గోల్నాక తులసీరామ్‌ నగర్‌ ప్రాంతంలో సత్యమ్మ తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటుంది. ఆమె భర్త చనిపోవడంతో భిక్షాటన చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో జగదీశ్‌ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతనితో సహజీవనం చేస్తూ ఉండేది. ఆ వ్యక్తి ఎలాంటి పని చేయకుండా తిరిగి ఆమె వద్ద నుంచే డబ్బులు లాక్కొని ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. కుటుంబ దీనస్థితిని చూసిన చిన్న కూతుర నిఖిత(23) మలక్‌పేట గంజ్‌లో డ్రై ఫ్రూట్స్‌ దుకాణంలో పని చేస్తోంది.

Daughter Murder Father In Amberpet : జగదీశ్‌ ఏ పనిచేయకపోగా నిత్యం మద్యం తాగి వచ్చి భార్య, కుమార్తెతో గొడవ పడేవాడు. ప్రతిరోజు ఇలానే చేయడంతో విసిగిపోయిన.. కన్నతండ్రి కాకపోయిన తనలో తన నాన్నను చూసుకుంటూ ఏం అనకుండా ఉండేది. ఇది చుట్టుపక్కల వాళ్లకు మొదట ఇబ్బందిగా ఉన్నా.. ప్రతిరోజు ఇలానే ఉండడంతో వాళ్లు కూడా చూసిచూడనట్లు ఉండేవారు. నిఖిత ప్రతిరోజు దుకాణం నుంచి ఆలస్యంగా వచ్చేది. దీంతో కోపం వచ్చిన పెంపుడు తండ్రి ఎందుకు లేట్‌గా వస్తున్నావని అడిగేవాడు. ఇలా ప్రతిరోజు ఆమె ఆలస్యంగా రావడంతో.. శనివారం అర్ధరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి తండ్రి గొడవపడ్డాడు.

గాజు పెంకుతో పెంపు తండ్రిని హతమార్చి : ఆరోజు నిఖితను షాప్‌ నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వస్తున్నావని పెంపుడు తండ్రి జగదీశ్‌ గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. ఇక కోపం పట్టలేక ఆమె అక్కడే పడి ఉన్న పగిలిన అద్దం ముక్కను తీసుకుని తన గొంతులో పొడిచింది. అధిక రక్తస్రావమైన ఆయనను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలైన కూతురు నిఖితను అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత ఆమెపై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 31, 2023, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.