రాష్ట్రంలోని పాఠశాలలకు, కళాశాలలకు ఈ నెల 28 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు అక్టోబరు 13 వరకు మొత్తం 16 రోజులు సెలవులు ఇచ్చారు. డిగ్రీ కళాశాలలకు 28 నుంచే సెలవులు ప్రారంభమైనా పునః ప్రారంభ తేదీలు ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో విధంగా మారాయి. కొన్ని వర్సిటీలు 10న పునఃప్రారంభం అని తెలుపగా, మరికొన్ని 12న పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇంటర్ విద్యార్థులకు 9 వరకే...
అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాలలకు 28 నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 10న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
సెలవుల్లో పాఠాలు వద్దు..
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఒక కాలేజీలో చేరి మరో కళాశాలలకు మారాలనుకుంటే ఈనెల 25 నుంచి 30 వరకు మొదటి కళాశాలలో డిలీట్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండిః దసరా కోసం ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సులు