ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ఫుట్ బోర్డు ప్రయాణమే ప్రమాదం. అలాంటిది ఓ విద్యార్థి చేసిన సర్కస్ ఫీట్ చూపరులను సైతం భయానికి గురిచేసింది. రాణీగంజ్ డిపోకు చెందిన బస్సులో రద్దీ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఓ విద్యార్థి బస్సు వెనుక భాగంలోని బ్రేక్ లైట్ల వద్ద ఉన్న పట్టీలపై నిల్చుని ప్రయాణం చేశాడు. ఇలా ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా...ఉదయం కాలేజ్ సమయంలో ఒకే బస్ ఉండటం వల్ల ఇబ్బందులు తప్పడం లేదంటూ విద్యార్థులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: డెంగీ లక్షణాలతో నాలుగోతరగతి చిన్నారి మృతి