TSRTC 4% DA To TSRTC Employees : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.. ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు. మూడేళ్ల నుంచి నాన్చుకుంటూ వస్తున్న డీఏను ఇప్పుడు ఇవ్వనున్నారు. ఈ డీఏ మొత్తం జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న.. 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు 2011లో 29 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని పోరాడారు. వారి పోరాట పటిమకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా.. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క డీఏను త్వరలోనే సంస్థ ఉద్యోగులకు ప్రకటిస్తోందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) June 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) June 1, 2023తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) June 1, 2023
TSRTC Salaries Hike : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ గత మే నెలలోనే తెలిపారు. అందుకు తగ్గ చర్యలను వెంటనే చేపట్టాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ కమిషన్ అమలుకు.. ఉద్యోగులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇప్పుడు సీఎం నిర్ణయంతో వారు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ తోడు 2013లో పీఆర్సీ బకాయిలు 50 శాతం పెండింగ్‌లో ఉంటే.. వాటికి సర్కార్ బాండ్లను ఇచ్చింది.
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బస్సులు, సౌకర్యాలు పెంపు : రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను ప్రవేశపెట్టడం, బస్సుల్లో ఉచిత వైఫై, జీవా అనే పేరుతో మంచి నీటి బాటిళ్లను విక్రయించడం, ఈ-బస్సులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు స్నాక్స్ బాక్స్‌ను ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తెచ్చే విధంగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ప్రయత్నాలను చేస్తోంది.
ఇవీ చదవండి :