లాక్ డౌన్ అమలులో భాగంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో రహదారిపైకి వచ్చిన వాహదారులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆపి... లాక్ డౌన్ ఉద్దేశాన్ని వివరించారు. అత్యవరమైన వారు మినహా ఇతరులను తిరిగి వెనక్కి పంపుతున్నారు.
నగరంలోని పలు కూడాళ్లలోనూ పోలీసులు ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారుల వివరాలను సేకరిస్తున్నారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కార్లలో అయితే ఒకరు లేక ఇద్దరే రావాలని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్: అత్యవసరమైతేనే రండి లేదంటే కేసులు