కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేయడం వల్ల ఇతర రోగులకు మేలు చేసిన వారవుతారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ప్రతి ఒక్కరు 500 ఎమ్.ఎల్ రక్తం ఇవ్వడం వల్ల ఇద్దరు కరోనా రోగులను కాపాడవచ్చని సజ్జనార్ పేర్కొన్నారు. ప్లాస్మా ఇచ్చిన వాళ్లలో మూడు రోజులలోపే తిరిగి ప్లాస్మా తయారవుతుందన్నారు.
పోలీసు శాఖలో ఇప్పటికే కొంత మంది ప్లాస్మా ఇచ్చారని చెప్పారు. ఇలా చాలా మంది ప్లాస్మా ఇచ్చి కరోనాతో ఇబ్బంది పడే వాళ్లను ఆదుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి 95 శాతానికి పైగా కొలుకుంటున్నప్పటికీ కొంతమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపారు. రోగ నిరోధక శక్తిపై వైరస్ దాడి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని సజ్జనార్ అన్నారు.
ఇదీ చూడండి : ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష