ETV Bharat / state

దర్యాప్తులో క్లూస్​ టీమ్​లదే​ కీలక పాత్ర: సీపీ సజ్జనార్​ - క్లూస్​ టీమ్​ తాజా వార్తలు

క్లిష్టమైన కేసుల దర్యాప్తులో క్లూస్ టీమ్​లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 9 ఏసీపీ డివిజన్లకు సంబంధించి ప్రత్యేక వాహనాలు, పరికరాలు, బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు.

Cyberabad cp sajjanar inguarautated clues  team vehicles in hyderabad
దర్యాప్తులో క్లూస్​ టీమ్​లదే​ కీలక పాత్ర: సీపీ సజ్జనార్​
author img

By

Published : Nov 6, 2020, 3:14 PM IST

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 9 ఏసీపీ డివిజన్లకు సంబంధించి ప్రత్యేక వాహనాలు, పరికరాలు, బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సీపీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. క్లిష్టమైన కేసుల దర్యాప్తులో క్లూస్ బృందాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శాస్త్రీయంగా స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో ఈ బృందాలు చాలా ముందుంటాయని... తద్వారా కేసుల పరిష్కారం సులభతరమవుతుందని ఆయన తెలిపారు.

గతంలో కమిషనరేట్ పరిధిలోని ఒక డీసీపీ పరిధిలో ఒక క్లూస్‌ టీం ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉండేది... ప్రస్తుతం ఒక్కో డివిజన్‌కు ఒకటి చొప్పున క్లూస్ బృందం అందుబాటులోకి రావటంతో ఈ వ్యవస్థ మరింత బలోపేతమైందని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ప్రకాశ్​ రెడ్డి, పద్మజ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.