ETV Bharat / state

CP Sajjanar: 'నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి' - hyderabad latest news

వర్షాకాలం ఆరంభమవడంతో అక్రమార్కులు నకిలీ విత్తనాల విత్తనాల దందాకు తెరలేపారు. వీటిని నిరోధించడానికి.. ప్యాకెట్లపై అధీకృత కంపెనీల లేబుళ్లు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దని సైబరాబాద్ సీపీ రైతులకు సూచించారు.

cyberabad cp on fake seeds in hyderabad
CP Sajjanar: 'నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా రైతులు ఉండాలి'
author img

By

Published : Jun 12, 2021, 6:43 AM IST

రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో.. అక్రమార్కులు నకిలీ విత్తనాలు విక్రయాలకు తెరలేపారు. అప్రమత్తమైన పోలీసు శాఖ విస్తృత దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు.

4,500 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 4 వేల కిలోల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత బీజీ-2 రకం పత్తి విత్తనాలు 4,290 కిలోలు, 115 కిలోల బీజీ-3 విత్తనాలు, 10 లీటర్ల గ్లైఫోసేట్ కలుపు మందు, మరో 100 లీటర్ల క్రిమిసంహారక పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు.

నాసిరకం విత్తన విక్రయాలపై సమాచారం తెలిస్తే 9490617444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కోరారు. ప్యాకెట్లపై అధీకృత కంపెనీల లేబుళ్లు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు.

ఇదీ చూడండి: ఉగ్రవాది అరెస్ట్​- విదేశీ ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.