హైదరాబాద్ రహ్మత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి గూగుల్‌పే యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేశారు. సాంకేతిక లోపంతో పూర్తి కాలేదు. స్థితి తెలుసుకునేందుకు అంతర్జాలంలో వినియోగదారుల సేవా కేంద్రం నంబర్‌ను అన్వేషించారు. ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి.. ‘మీరు కోల్పోయిన నగదు రిఫండ్ చేస్తానని నమ్మించాడు. ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు చెప్పాలని సూచించాడు. ఓటీపీ చెప్పటం వల్ల బ్యాంకు ఖాతాలోంచి రూ.99 వేలు మాయమయ్యాయి.
సేవల పునరుద్ధరణ కావాలా?
మెహదీపట్నం వాసి ఓ వ్యక్తికి మీ పేటీఎం ఖాతా రద్దు అయిందని.. పునరుద్ధరణ చేసుకోవాలని ఫోన్ వచ్చింది. సేవలు నిరంతరాయంగా కొనసాగాలంటే తాము పంపించే ఓటీపీ చెప్పాలని సూచించారు. బాధితుడు ఓటీపీ చెప్పటం వల్ల ఖాతాలో ఉన్న రూ.79 వేలు ఇతర ఖాతాలకు మళ్లాయి.
కేవైసీ పేరుతో మోసం
బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తికి పేటీఎం కేవైసీ చేయాలని సైబర్ నేరస్థులు ఫోన్ చేశారు. పేటీఎం ప్రతినిధులుగా భావించి సమాచారంతోపాటు ఓటీపీలు చేప్పాడు. దీంతో ఖాతాలో ఉన్న రూ.89 వేలు మాయమయ్యాయి.