ETV Bharat / state

Cyber Fraud In Hyderabad : ఎన్‌ఎస్‌జీ కమాండోని.. ఇల్లు అద్దెకు కావాలంటూ... లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు - House Rent Frauds

Cyber Fraud In Hyderabad : సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి.. బాధితుల నుంచి దండుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్ఎస్జీ కమాండో అని చెప్పి ఇల్లు అద్దెకు కావాలంటూ సైబర్ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ.2.41 లక్షలు కొట్టేశారు.

Cyber Fraud In Telangana
Cyber Fraud In Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 2:27 PM IST

Cyber Fraud In Hyderabad : ఎన్‌ఎస్‌జీ కమాండో అని చెప్పి హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సంప్రదించిన సైబర్ నేరగాడు ఇల్లు అద్దెకు కావాలంటూ రూ.2.41 లక్షలు కొట్టేశాడు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(Software Engineer) తన రెండు పడక గదుల ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నాడు. మ్యాజిక్‌ బ్రిక్‌ మొబైల్‌ యాప్‌లో ఇంటి వివరాలు, ఫోన్‌ నెంబరు నమోదు చేశాడు.

Fraud In The Name Of Army Hyderabad : సెప్టెంబరు 19వ తేదీన ఆశిష్‌ కుమార్‌ పహారీ పేరుతో ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి తనని తాను ఎన్‌ఎస్‌జీ కమాండోనంటూ పరిచయం చేసుకున్నాడు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అవుతున్నానని, ఇల్లు అద్దెకు కావాలని కోరాడు. ఆధార్, ఎన్‌ఎస్‌జీ గుర్తింపు, ఇతర కార్డులు పంపించాడు. ఆ తర్వాత ఆర్మీలో అకౌంటింగ్‌ అధికారినంటూ కెప్టెన్‌ రాజేంద్రసింగ్‌ షెకావత్‌ పేరుతో మరో వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఆశిష్‌కుమార్‌ మీ ఇంట్లోకి అద్దెకు వస్తున్నాడని సమాచారముందని ధ్రువీకరించుకునేందుకు కాల్‌ చేసినట్లు చెప్పాడు.

ఇన్సురెన్స్​ పాలసీలో బెనిఫిట్స్​ కావాలా అంటూ.. కస్టమర్​ కేర్​ నుంచి ఫోన్​ వచ్చిందా!.. తస్మాత్​ జాగ్రత్త

Cyber Crimes Hyderabad : ఆర్మీ నిబంధనల ప్రకారం రెండు నెలల అడ్వాన్సు ఇవ్వాలంటే.. ఇంటి యజమాని ముందుగా తమకు డబ్బు పంపించాలని షెకావత్‌ చెప్పాడు. ఆ తర్వాత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం(Command Control Center) నుంచి రెట్టింపు మొత్తం తిరిగి బదిలీ అవుతుందని చెప్పాడు. ఇదంతా నమ్మిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ రెండు నెలల అడ్వాన్సు మొత్తం రూ.46 వేలు గూగుల్‌ పే నుంచి పంపాడు. నిర్ణీత మొత్తం కంటే రూ.5 ఎక్కువ పంపినందున ఈ సొమ్ము తిరిగి పంపే ప్రక్రియ ఆగిపోయిందని.. కేవలం రూ.45,995 మరోసారి పంపిస్తే మొత్తం డబ్బు బదిలీ చేస్తామని నమ్మించాడు.

Loan App Harassment Hyderabad : లోన్​ యాప్​ డౌన్​లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రదర్​!

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రెండోసారి కూడా డబ్బు పంపాడు. ఈ మొత్తం కూడా తమకు అందలేదని రూ.50 వేలు పంపాలని కోరగా అదే చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి తప్పుడు లావాదేవీల కారణంగా మొత్తం ఆర్మీ ఖాతా స్తంభించిపోయిందని రూ.50 వేలు, రూ.49,995 చొప్పున రెండు సార్లు బదిలీ బదిలీ చేయాలని సూచించాడు. ఇలా మొత్తం రూ.2.41 లక్షలు బదిలీ చేశాడు. అయినా ఆర్మీ నిబంధనల పేరుతో పదేపదే డబ్బు అడగడంతో బాధితుడు మోసపోయానని గ్రహించాడు. చివరకు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Police Arrested Cyber Gang : సైబర్‌ మోసాల్లో 'ఉగ్ర' లింకుల కలకలం

Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.