ETV Bharat / state

'మేం పేటీఎం ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం...' - సైబర్ క్రైం

ఆన్​లైన్​లో ఆర్థికలావాదేవిలు జరుపుతూ మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉన్నారు. సాంకేతిక నిరక్షరాస్యతే సైబర్ కేటుగాళ్లకు కోట్లు సంపాదించిపెడుతున్నాయి. ఏది అసలు.. ఏది నకిలీ అని తెలుసుకోలేకపోవడమే వీటన్నింటికి కారణం అంటున్నారు సైబర్ నిపుణులు.

cyber criminals in hyderabad
'మేం పేటీఎం కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం...'
author img

By

Published : Feb 12, 2020, 10:57 AM IST

Updated : Feb 12, 2020, 3:02 PM IST

పేటీఎం కార్యాలయం నుంచి కాల్​ చేస్తున్నాం.. కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలంటూ ఇద్దరిని ముగ్గులోకి దింపి రూ.2.75 లక్షలు కాజేశారు సైబర్‌ కేటుగాళ్లు. బాధితులు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

న్యూనాగోల్‌కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి ఈ నెల 10న‘'ఎండీ అలర్ట్స్‌'’ పేరుతో ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. కేవైసీ వివరాలను సమర్పించేందుకు వెంటనే 6296269598కు కాల్‌ చేయాలని, లేదంటే మీ పేటీఎం ఖాతా స్తంభించిపోతుందంటూ అందులో పేర్కొన్నారు.

బాధితుడు ఇవేమి తెలియక ఆ నెంబర్​కు కాల్​ చేశాడు. పేటీఎం ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ మహేష్‌ శర్మ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. కేవైసీ వివరాలను నమోదు చేసేందుకు 'క్విక్‌ సపోర్ట్‌ యాప్‌'ను డౌన్‌లోడ్‌ చేసుకోమని సూచించారు.

నిజమేనని భావించిన బాధితుడు డౌన్‌లోడ్‌ చేసుకుని రిఫరెన్స్‌ నంబర్‌ను కేటుగాడికి తెలియజేశాడు. ఆ తర్వాత ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్‌ కార్డుల నుంచి రూ.1.65 లక్షలు ఖర్చు చేసినట్లుగా ఎస్‌ఎంఎస్‌ రావడంతో కంగుతిన్నాడు.

ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

మరో సైబర్​ కేసులో కొత్తపేట్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా అదే రోజు ‘'ఏడీ-అలర్ట్స్‌' నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. పేటీఎం ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ రాజేందర్‌ సింగ్‌ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. గూగుల్‌లో పేటీఎం వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి డెబిట్‌ కార్డు వివరాలను నమోదు చేయమని సూచించాడు.

కూతురి డెబిట్‌ కార్డును కూడా పేటీఎం ఖాతాకు అనుసంధానం చేశాడు. ఓటీపీని సెర్చ్‌ ఆప్షన్‌లో కొట్టాడు. ఆ వివరాలను సేకరించిన కేటుగాడు రెండు డెబిట్‌ కార్డుల నుంచి రూ.1.09 లక్షలు కొల్లగొట్టాడు.

సైబర్​ ప్రపంచంలో ఎన్ని అనుకూలతలు ఉంటాయో.. అన్ని చిక్కుముడులూ ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తవహించినా.. ఇస్మార్ట్​ నేరస్థులు కాపుకాచుకుని ఉంటారు. అత్యంత సులభంగా మీ ఎకౌంట్​ నుంచి డబ్బులు కాజేస్తారు.

ఇవీ చూడండి: 'అబలలను ఎరవేస్తోన్న సైబర్ కేటుగాడు అరెస్ట్'

ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

సైబర్​ క్రైం నేరస్థుల నయా దోపిడీ విధానం

Last Updated : Feb 12, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.