Cyber Crimes in Telangana 2023 : రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన పెట్టుబడి కుంభకోణం రూ.712 కోట్లు దోచుకున్న కీలక సూత్రధారులు చైనీయులు. ఇక్కడ జీతంమీద పని చేసిన వారిని పోలీసులు పట్టుకున్నా.. వందల కోట్లు దోచుకున్న చైనీయులు మాత్రం స్వదేశంలో క్షేమంగానే ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన లౌలాంగ్జన్, కెవిన్ జూన్, షాషాలు చైనాలోనే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఈ తరహా కేసులు పెరిగిపోతుండటంతో విదేశాల్లో నక్కినవారిని ఎలా రప్పించాలన్న దానిపై అధికారులు యోచిస్తున్నారు.
Cyber Criminals Absconding to Abroad From India : దేశంలో ఎవరు నేరానికి పాల్పడినా వారిని భారతీయ చట్టాల ప్రకారం అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ నేరగాళ్లు విదేశాల్లో ఉంటే మాత్రం భారతీయ చట్టాలు ఇతర దేశాల్లో వర్తించవు. సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దులు చెరిపేసి నేరగాళ్లు సంపద ఎక్కడుంటే అక్కడి నుంచే దోచుకుంటున్నారు. విదేశాల్లో ఉండి ఇక్కడి వారితో నేరాలు చేయించడం, లేదా ఇక్కడ నేరాలు చేసి ఇతర దేశాలకు వెళ్లిపోవడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా, ప్రధానంగా ఉంటున్నవి సైబర్ నేరాలు.
Cyber Criminals Escapes to Abroad From India : మూడు సంవత్సరాల క్రితం రుమేనియాకు చెందిన డినిటి విర్జిల్ సొరెనిల్, జియోర్డ్ క్రిస్టినాలను హైదరాబాద్ పోలీసు అరెస్ట్ చేశారు. ఏటీఎంలలో చిన్న ఉపకరణాన్ని అమర్చి.. వీరు సమాచారాన్ని తస్కరించేవారు. దాన్ని రుమేనియాలో ఉన్న ప్రధాన నిందితుడు క్రిస్టీకి పంపించేవారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి రుమేనియాకు వెళ్లిపోయారు. ప్రధాన సూత్రధాని క్రిస్టీ అన్నది తెలియనే లేదు.
African Drug Dealers in India : బహుమతి వచ్చిందని చెప్పగానే అసలు విషయం ఆలోచించకుండా నమ్మి అడిగిన విషయాలకు అన్ని చెప్పేస్తారు. ఇలాంటి మోసాల్లో నిందితులంతా నైజీరియన్లే. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న మత్తుమందుల కేసుల్లోనూ కీలక నిందితులు అధికంగా ఆఫ్రికా దేశాల్లోనే ఉంటున్నారు. అసలు నిందితులు దొరక్కపోతే ఏ కేసైనా బలహీనపడుతుంది. ఇదే వారికి అదునుగా మారుతోంది. భారత్‌లో పట్టుబడ్డవారికి శిక్ష పడటం కూడా కష్టమే. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు ఇక్కడి వారిని నియమించుకొని సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ వీరు నియమించుకున్న వారు పోలీసులకు పట్టుబడినా ఇంకో ముఠాను తయారు చేసుకొని నేరాలు కొనసాగిస్తూనే ఉంటారు. పోలీసులకు ఇప్పుడు ఇదే పెద్ద సవాల్‌గా మారింది.
నిందితులంతా విదేశాల్లోనే : కృషి బ్యాంకును దోచుకొని విదేశాలకు పారిపోయిన వెంకటేశ్వరరావును, గంధపు చెక్కల అక్రమ రవాణా కేసులో ఇరుక్కొని, పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు చెక్కేసిన ఎర్రగంగిరెడ్డిని రప్పించడానికి పోలీసు శాఖకు సంవత్సరాలు పట్టింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్‌ను న్యూజిల్యాండ్ నుంచి రప్పించలేకపోతున్నారు. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు. విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకోవడం పెద్ద సవాలుగా మారిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి రూ.1.96 కోట్లు దోచుకున్న సూత్రధారుల బ్రెజిల్‌లో బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మహేశ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ. 12 కోట్లు కొల్లగొట్టిన సైబర్ చోరీలో అసలు నిందితులు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. విదేశాల నుంచే ఈ మోసాలు జరిగినట్లు మాత్రం గుర్తించగలిగారు. అడక్కుండానే రుణాలు ఇచ్చి, వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడి అనేక మంది చావుకు కారణమవుతున్న లోన్‌యాప్‌ల నిర్వాహకులు చైనా నుంచే ఈ కథ నడుపుతున్నా వారిని కూడా పట్టుకోలేకపోతున్నారు.
ఇవీ చదవండి: